Sunday 15 December 2013

GoM


ఇంటిమీద పడ్డ గుంపు 

పైకప్పు పెంకుల్ని పెకలిస్తాయి

ఊరి మీద పడి అదే గుంపు

అరటి గెల కాయల్ని వేరు చేస్తాయి

Sunday 7 July 2013

సింగంపల్లి కవితలు


చెరువులో దిగి నే దిగాలుగా చూస్తుంటే
చేప పిల్లలు నా పాదాలపై ముద్దాడాయి
జలకాలాటలో మునిగి నే కళ్ళు తేలేస్తే
ఆక్సిజన్ ని అందించి కొత్త జన్మనిచ్చాయి
***
మా అందరినీ అమ్మమ్మ ఊర్లకి పంపి
వేసవి సెలవల్లో మా బడి
తనకు తానుగా తాళం వేసుకుని
నిశబ్ద ఏకాంతంలోకి జారుకుంది
***
పేక బెత్తంతో మా లెక్కల మాస్టారు
ఎక్కాల్ని పక్కగా అప్పచేప్పేవాళ్ళం
గోళీలాడుతూ కనిపిస్తే లెక్క చేసేవారు కాదు
ఆయనో లెక్కైన మనిషి
***
బుడ్డి దీపం వెలుతురు
అరుగు మీద చదువులు
అర్థరాత్రి ఇంటికి పరుగులు
సినిమాలూ కంబైన్డ్ స్టడీసే
***
చూపుడు వేలితో
రంగుల గాజు గోళీని
నేనెక్కిపెట్టి నేలపై జారవిడిస్తే
భూగోళం గిరగిరా తిరిగాడేది

Sunday 16 June 2013

పెద్దాపురం నడిబొడ్డు


 
తెలుగు దేశంలో పుట్టిపెరిగిన బొడ్డు
సరికొత్తగా పట్టాడు పురంలో ఇంకో తెడ్డు
దొరుకునా నీకు వై.కా.పా. లో ఫుడ్డు
ఈత రాకుంటే రాజకీయాలే జిడ్డు జిడ్డు
 


Tuesday 25 December 2012

ఆమోది


రంగుల కలలో కొట్టుకుపోయింది కాంగి
కంగు తినిపించాడు మూడోసారి మోడీ
అవినీతి, అత్యాచారాలపై ప్రతాపించు బాది
అభివృద్ధి, విద్యాబుద్ది ప్రసాదించు మోడీ