Tuesday, 25 December 2012

ఆమోది


రంగుల కలలో కొట్టుకుపోయింది కాంగి
కంగు తినిపించాడు మూడోసారి మోడీ
అవినీతి, అత్యాచారాలపై ప్రతాపించు బాది
అభివృద్ధి, విద్యాబుద్ది ప్రసాదించు మోడీ  

Friday, 5 October 2012

జీవ నైవేద్యం


కుప్పలు తెప్పలుగా తిరిగే కప్పలు
వీసా తీసుకుని విదేశాలకు గెంతేసాయి

కొక్కురోకో అంటూ ఉదయాన్నే  మేల్కొలిపే కోడి
కుక్కరికే పరిమితమై చావుకూతతో చస్తున్నాయి

మనిషితోపాటు కిచకిచలాడే పిచ్చుక గొంతు
మనందరికీ అవుట్ అఫ్ కవరేజ్ అయిపోయింది

మనిషి ఆలోచనలు అంతరిక్షానికి ఎగబాకి
రాబందు జాతినే అంతమొందించాడు

Wednesday, 15 August 2012

వాన్ పిక్ ప్రసాదం


అనగనగా వాన్ పిక్ భూతం పాపాన
నీ మానాన నీవుండలేదా 'ధర్మాన' 
అస్తవ్యస్తమయ్యింది ఆ రాజ పాలన
అస్తమిస్తోందా ఇక కాంగ్రెస్ పరిపాలన

Tuesday, 31 July 2012

కే ఏ లోపాల్

ప్రపంచ శాంతి కోసం పరితపించానంటాడు
దేశ విదేశాల ప్రముఖుల్ని కలిసానంటాడు
అరెస్ట్ అయి నేనేమి తప్పు చేయలేదంటాడు
మతి చెలించిందేమో అంటే లేదు పొమ్మంటాడు

Monday, 25 June 2012

వీడు మామోలోడు కాడు

పట్టాబి ఫటాఫట్ "మనీ" తేల్చేసాడు
గాలి కేసుని జాలీగా తీసుకున్నాడు
జైల్లో నానా.. రోగాల చిట్టా విప్పాడు
అవినీతి రోగం లేదని మాట తప్పాడు

Friday, 18 May 2012

జిగేల్ జిగేల్

గ్లౌసులను సవరిస్తే చెలరేగి ఆడతాడు
బేట్టుతో రన్ రేట్ కి బూస్ట్ ని తాగిస్తాడు
ఆవాహమై పరుగుల ప్రవాహం సృష్టిస్తాడు 
భాష్ గేల్ మైదానమంతా జిగేల్ జిగేల్

రక్త చరిత్ర

పితృత్వపు కేసులో దిగజారుడు
పీకల్లోతు మునిగి కప్ప దాటుడు
ఫ్లాష్ బ్యాక్ లో తనదంతా గోకుడు
అడుగులు జాగ్రత్త అంతా పాకుడు

Sunday, 13 May 2012

అనుభవించు రాజా

అమాచ్యులవారు లోక్ సభకు వెళ్లారు
అమ్యామ్యాలతో లోకం తెరకెక్కారు
స్పెక్ట్రం కేసులో 2జి స్టెప్ లేసారు
తీహార్  జైల్లో చివరకి తిష్ట వేసారు

Saturday, 12 May 2012

తప్పుల కుప్ప

సరిహద్దుల్లో జే.సి.బి లతో చేసాడు కుప్ప
నువ్వేమైనా తక్కువ తిన్నావా యడ్యూరప్ప
తవ్వినదాన్ని తన్నుకుపోవడమే కదా గొప్ప
పాలనలో నువ్వేమి కాదుగా నూతిలో కప్ప

Monday, 30 April 2012

పట్టుకుంటే లక్ష

లక్ష కోసం లక్ష్మణ రేఖ దాటాడు
తెహల్కా ఉచ్చులో పుచ్చు పడ్డాడు
తిని కూర్చోక ఎందా మకిలి సంగతి
తీహార్ జైల్లో ఇక చిప్పకూడే నీ గతి

Saturday, 31 March 2012

వీడింతే

అలసట తెలియని ఆటగాడు
ఆటలో అరటిపండవ్వనివాడు
రికార్డులకోసం వెంపర్లాడనివాడు
ద్రా వీడింతే దాహం తీర్చుకోలేదు

Wednesday, 7 March 2012

ఏ మాయ చేసావే

గున్న ఏనుగు లాంటి పార్టీ
దున్నపోతై పడిన మెజారిటీ
ముక్కల ముక్కలగా చేస్తానన్నావ్
పులుసులో ముక్కై మిగిలిపోయావ్

Tuesday, 14 February 2012

రా'కూల్' గాంధీ

కాంగ్రెస్ కి రాహుల్ దీపావళి మతాబు
వానాకాలం కప్పని బి. జె .పి. కితాబు
అమేథిలో అలుపెరగని ప్రచారంతో గాంధీ
అమ్మకు తినిపిస్తాడో లేదో తీ భూంది

Sunday, 12 February 2012

పాట కోవా

తకదిం.. తకదిం.. అంటూ తాళం
సంగీత ప్రియులకు వేసాడు గాలం 
తడిపొడి మాటల మాయాజాలం
కొలవరి పాటతో కోలాహలం

Tuesday, 31 January 2012

రోమ దేహ బాబా

జాగాకో రేటు చొప్పున యోగా
 బాగానే కోట్లు కూడపెట్టాడు బాబా
అంతర్జాతీయంగా ఆయుర్వేదం
అంతర్లీనంగా ఎందుకో రాజకీయం