Friday, 18 May 2012

జిగేల్ జిగేల్

గ్లౌసులను సవరిస్తే చెలరేగి ఆడతాడు
బేట్టుతో రన్ రేట్ కి బూస్ట్ ని తాగిస్తాడు
ఆవాహమై పరుగుల ప్రవాహం సృష్టిస్తాడు 
భాష్ గేల్ మైదానమంతా జిగేల్ జిగేల్

రక్త చరిత్ర

పితృత్వపు కేసులో దిగజారుడు
పీకల్లోతు మునిగి కప్ప దాటుడు
ఫ్లాష్ బ్యాక్ లో తనదంతా గోకుడు
అడుగులు జాగ్రత్త అంతా పాకుడు

Sunday, 13 May 2012

అనుభవించు రాజా

అమాచ్యులవారు లోక్ సభకు వెళ్లారు
అమ్యామ్యాలతో లోకం తెరకెక్కారు
స్పెక్ట్రం కేసులో 2జి స్టెప్ లేసారు
తీహార్  జైల్లో చివరకి తిష్ట వేసారు

Saturday, 12 May 2012

తప్పుల కుప్ప

సరిహద్దుల్లో జే.సి.బి లతో చేసాడు కుప్ప
నువ్వేమైనా తక్కువ తిన్నావా యడ్యూరప్ప
తవ్వినదాన్ని తన్నుకుపోవడమే కదా గొప్ప
పాలనలో నువ్వేమి కాదుగా నూతిలో కప్ప