Friday, 5 October 2012

జీవ నైవేద్యం


కుప్పలు తెప్పలుగా తిరిగే కప్పలు
వీసా తీసుకుని విదేశాలకు గెంతేసాయి

కొక్కురోకో అంటూ ఉదయాన్నే  మేల్కొలిపే కోడి
కుక్కరికే పరిమితమై చావుకూతతో చస్తున్నాయి

మనిషితోపాటు కిచకిచలాడే పిచ్చుక గొంతు
మనందరికీ అవుట్ అఫ్ కవరేజ్ అయిపోయింది

మనిషి ఆలోచనలు అంతరిక్షానికి ఎగబాకి
రాబందు జాతినే అంతమొందించాడు

Wednesday, 15 August 2012

వాన్ పిక్ ప్రసాదం


అనగనగా వాన్ పిక్ భూతం పాపాన
నీ మానాన నీవుండలేదా 'ధర్మాన' 
అస్తవ్యస్తమయ్యింది ఆ రాజ పాలన
అస్తమిస్తోందా ఇక కాంగ్రెస్ పరిపాలన

Tuesday, 31 July 2012

కే ఏ లోపాల్

ప్రపంచ శాంతి కోసం పరితపించానంటాడు
దేశ విదేశాల ప్రముఖుల్ని కలిసానంటాడు
అరెస్ట్ అయి నేనేమి తప్పు చేయలేదంటాడు
మతి చెలించిందేమో అంటే లేదు పొమ్మంటాడు

Monday, 25 June 2012

వీడు మామోలోడు కాడు

పట్టాబి ఫటాఫట్ "మనీ" తేల్చేసాడు
గాలి కేసుని జాలీగా తీసుకున్నాడు
జైల్లో నానా.. రోగాల చిట్టా విప్పాడు
అవినీతి రోగం లేదని మాట తప్పాడు