Thursday, 29 December 2011

'స్టార్' లీడర్

ఓ చేతిలో ఘనమైన పట్టా
ఓ  చేతిలో గణాంకాల చిట్టా
లోకల్ జనపత్తాలేని లోక్ సత్తా
పొరుగికి విస్తరిస్తే ఏముందీ కొత్త

Wednesday, 28 December 2011

దువ్వడూ దువ్వించుకోడు

వర్తమానం పంపితే వెంకన్నే ఎదురొస్తాడు
చిటికేస్తే మన కనుమూరి చిత్తమంటాడు
కాలి నడకతో వన్నె తెచ్చుకున్న బాటసారి
జన సన్నిధిలో శభాష్ ఆర్.బి.ఐ దువ్వూరి

Wednesday, 30 November 2011

ఛీ లచ్మి


సివిల్స్ లో నెగ్గుకొచ్చిన ఓ రాణి 
సీటులో ఒదిగి ఏమిటి నీ బాణి
ఎస్ యూ ఆర్ ఏ ఐ.ఏ.ఎస్
ఆర్ యూ సరంర్ టు వై.యస్

Wednesday, 5 October 2011

చిదంగరం


చిందరవందరగా కట్టడు ఎప్పుడూ లుంగీ
చిందులేయించాడు ఆంధ్రాలో వున్నట్టుండి
మిళ మిళ మెరిసిపోతూ వుంటుంది తన అంగీ
ళంకుడివై 2Gని కాకెంగిలి గానీ చేశావా తంబీ

Thursday, 29 September 2011

స్లోనియా


వ్యక్తిగత అనారోగ్యం సరే గోప్యం
వ్యక్తుల మధ్య విభేదాలికి ఆజ్యం
తెగేసి చెప్పేయి రాదు ఎందుకీ జాప్యం
తెలంగాణాకి వుందోలేదో రాజపూజ్యం

Tuesday, 27 September 2011

ప్రాంతీయుడు


ఉద్యమానికి వూపిరి ఇచ్చావు
ఉస్మానియాకి పిచ్చి వూపిచ్చావు
సూటి పోటి వినసొంపు నీ వాక్కు
సూటిగా దిక్సూచై  చెబుతోంది నీ ముక్కు

Monday, 19 September 2011

శక్తిహీనమాన్


పదవి ఫాస్ట్ ఫుడ్ అనుకుని పరిగెత్తాడు
వెదవది  వేస్ట్ అనుకుని వూరుకున్నాడు 
నీకంటూ శాశ్వతంగా వుండాలి జగన్
ఇడుపులపాయలో ఓ ఓదార్పు భవన్

Saturday, 17 September 2011

ఆంధ్రా రోశన్


వై.ఎస్.ఆర్ పోతూ కిరీటం పెట్టాడు 
జగన్ వస్తూ కిరీటం నెట్టాడు
సొంతింటిలో రోశయ్యకు శోషొచ్చింది
పొరుగింటికి పంపి సోనియా శ్వాసిచ్చింది

Friday, 9 September 2011

లక్ష్మీ బావ

గని నాయకుల సంపదపై 
సైనికుడై కన్నేసిన సి.బి.ఐ.
లక్ష్యం తో వస్తాడు జేడి
లక్షణంగా వేస్తాడు బేడి

Wednesday, 7 September 2011

గాలి వాటం





గాలి కొదిలేసిన సంపదను
గాలించి గనుడయ్యావు
అంచలంచలుగా చక్రం తిప్పి
చంచలగూడాలో  చతికిలబడ్డావు

Saturday, 13 August 2011

కామి నిత్యానింద


బాబాగా బజారు అవతారం 
బలహీనతల బలత్కావతారం
ఇండియాకి ముడి సరుకు 
మీడియాకి మురికి సరుకు

Tuesday, 12 July 2011

అవే కళ్ళు


కన్ను మూస్తే కల
కన్ను తెరిస్తే సెగ
కే.సీ.ఆర్ నీ దుంప తెగ 
ఎందుకంట నా పై పగ

ప్రజా జాడ్యం


తెరాసాకి  చిన్నజీవి 
 కాంగ్రెస్కి  పెద్దజీవి 
విలీనంతో విలువలు తుష్ 
కలల పీఠంతో  దిల్కుష్ !!